మునగాల: మండల కేంద్రములోని తాహసిల్దార్ కార్యాలయంలో మండల స్పెషల్ ఆఫీసర్ డిప్యూటీ సీఈవో శిరీష ఆధ్వర్యంలో రైతు భరోసా పథకంపై వ్యవసాయ విస్తరణ అధికారులకు, రెవెన్యూ శాఖ సిబ్బందికి, అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులకు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రేపు గణపవరం, కలకోవ, మాధవరం, రేపాల రెవెన్యూ గ్రామాల్లో సాగుకి యోగ్యం కానీ భూములను సర్వే చేసి గుర్తించడం సమర్థవంతంగా చేయాలని ఆదేశించారు. అలాగే పొలం లేని ఉపాధి హామీ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు సర్వే గురించి గ్రామపంచాయతీ వారీగా రేపటి నుండి 20వ తారీకు వరకు సర్వే బృందాలు పరిశీలన చేస్తాయని అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల తాహసిల్దార్ వి ఆంజనేయులు మండల అభివృద్ధి అధికారి దీనదయాల్, మండల వ్యవసాయ అధికారి బి.రాజు, మండల సర్వేయర్ సరిత, వ్యవసాయ విస్తరణ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.