calender_icon.png 11 January, 2025 | 10:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు భద్రత నియమాలపై విద్యార్థులకు అవగాహన

11-01-2025 01:14:21 AM

నారాయణపేట, జనవరి 10(విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ స్కూల్, కళాశాలలో విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా రోడ్డు భద్రత నియమాలు పాటిం చాలని ఆర్టీవో మేఘాగాంధి అన్నారు. మీరు మీ తల్లిదండ్రులు ట్రాఫిక్ రూల్స్ పాటిం చాలని విద్యార్థులచే అధికారులు ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించి రోడ్డు భద్రతా నియమాలు పాటించి సురక్షితంగా తమ గమ్య స్థానాలకు చేరుకోవాలని అందు కోసం ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటిం చాలని కోరారు. ముఖ్యంగా వాహనాలు నడిపే సమయంలో తల్లిదండ్రులతో పాటు ఉన్నప్పుడు విద్యార్థులు హెల్మెట్ సీట్ బెల్ట్ ఉపయోగించాలని తల్లిదండ్రులకు తెలపా లని కోరారు.

అలాగే విద్యార్థులు అపరిచిత వ్యక్తుల నుండి అప్రమత్తంగా ఉండాలని ఎవరైనా కొత్త వ్యక్తులు  డబ్బులు ఆశ చూపి న తినుబండారాలు ఇచ్చిన వాటిని తీసుకో రాదని ఎవరైనా కొత్త వ్యక్తులు లిఫ్ట్ ఇస్తా అన్న తీసుకోరాదని  వారు చెప్పే మాయ మాటలు నమ్మకుండా జాగ్రత్తలు పాటించా లని తెలిపారు.

ఎవరైనా ఆపద సమయంలో ఉంటే వెంటనే డయల్ 100 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిం చారు. ఈ కార్య క్రమంలో సిఐ శివశంకర్ , ఎస్సు వెంకటేశ్వర్లు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.