నిర్మల్ (విజయక్రాంతి): సోన్ మండలంలోని పాక్ పట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యక్తిగత ఆరోగ్యం పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు మండల విద్యాశాఖ అధికారి పరమేశ్వర్ హెల్త్ కౌన్సిలర్ లావణ్య హాజరై పరీక్షల్లో మానసిక ఒత్తిడిని జయించడానికి ప్రణాళిక బద్ధంగా చదువుకోవాలని సమయానికి భోజనం చేసి తగినంత నిద్ర తీసుకోవాలని సూచించారు. ఏవైనా అనుమానాలు ఉంటే ఉపాధ్యాయులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.