calender_icon.png 17 January, 2025 | 12:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల్లో అండాశయ క్యాన్సర్‌పై అవగాహన

10-09-2024 04:38:48 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): మారుతున్న జీవనశైలితో మహిళలు ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని స్పోర్ట్స్ అండ్ ఫిట్‌నెస్  కన్సల్టెంట్, ట్రైనర్ దీప్తి అక్కి అన్నారు. మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో.. మహిళల్లో అండాశయ క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమ్నాన్ని సోమవారం ఆమె పారంభించారు. ఈ సందర్భంగా టీవీ నటి లహరి విష్ణువఝల, డా.ప్రవీణ్ అడుసుమిల్లి, మెడికల్ ఆంకాలజిస్ట్ మహేష్ దెగ్లూర్కర్‌తో కలిసి ఆమె వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. తదనంతరం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ ప్యాకేజీని దీప్తి ప్రారంభించారు. మహేష్ దెగ్లూర్కర్ మాట్లాడుతూ.. మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో అత్యాధునిక సదుపాయాలు, పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులో ఉన్నారన్నారు.