02-04-2025 12:16:38 AM
జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రెటరీ, న్యాయమూర్తి ఎస్ స్వాతి రెడ్డి
సిద్దిపేట, ఏప్రిల్ 1 (విజయక్రాంతి):విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ, న్యాయమూర్తి ఎస్. స్వాతి రెడ్డి సూచించారు. మండలం లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో మంగళవారం సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో గల ఆత్మ జ్యోతి రావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
బాలల హక్కుల పైన ప్రతి పౌరుడు కి అవగాహన ఉండాలని, మనం తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి ప్రతి ఒక్కరికి హక్కులు ప్రారంభమవుతాయన్నారు. ప్రతి పౌరుని హక్కులు భారత రాజ్యాంగంలో పటిష్టమైన చట్టం చేయడం జరిగిందన్నారు.
ఈ మధ్యకాలంలో ఫోక్స్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని చెప్పారు. విద్యార్థులు జీవితంలో సక్సెస్ కావాలంటే మీకు నచ్చిన రంగంలో నైపుణ్యత సాధించి దానికో సం మీరు కష్టపడితేనే ఉన్నత స్థాయిలో స్థిరపడతారని సూచించారు.
నిజ జీవితంలో మన కాళ్ళ మీద మనం బతకాలంటే నీకంటూ ఒక సామర్థత ఉన్నప్పుడు మాత్రమే మీరు ఒక అడుగు ముం దుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్త్స్ర అపూర్వ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ మాధవి లత, అడ్వకేట్ ఆర్. అరవింద్, సిబ్బంది శ్రీనివాస్, శ్రీకాంత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.