మందమర్రి (విజయక్రాంతి): పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ప్రజలకు జాతీయ ఆరోగ్య మిషన్, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పై సాంస్కృతిక కళాకారులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని యాపల్, మందమర్రి(వి), గ్రామాలలో గురువారం సాంస్కృతిక కళాకారులు అవగాహన కల్పించారు. పీహెచ్ సి పరిదిలో గర్భవతుల నమోదు, ఆసుపత్రుల్లో ప్రసవాలు 100% టీకాలు ఇప్పించడం జాతీయ క్షయ, కుష్టు నివారణ కార్యక్రమాలు అసంక్రమణ వ్యాధులైన బిపి షుగర్, క్యాన్సర్ వ్యాధులకు గుర్తించి చికిత్స చేయడము వంటి వాటిపై అవగాహన కల్పించారు. జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు మానసిక ఆరోగ్యం గురించి తెలియజేస్తు క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాల పైన అవగాహన కలిగించడం జరిగింది.
ఆయుష్మాన్ భవ ఆరోగ్య కేంద్రాల ద్వారా అందిస్తున్న వైద్య సదుపాయాలు తెలియజేయడం, లింగనిర్దారణ నేరము ఆడ అయినా మగ అయిన ఒకటే, భేటీ బచావో బేటి పడావో అనే నినాదాలతో ప్రచారం కల్పించారు. 108 వాహనంపై రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సదుపాయం 10 లక్షల వరకు పొందడంపైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, పర్యవేక్షకులు కళావతి, రమేష్ మధుసూదన్, సుజాత, రాజేశ్వరి, పద్మావతి, జ్యోతి, దేవిక, అనిత, ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యకర్తలు గ్రామస్థులు పాల్గొన్నారు.