calender_icon.png 28 October, 2024 | 1:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాణాసంచా వ్యాపారులకు అగ్గి ప్రమాదాలపై అవగాహన

28-10-2024 11:40:51 AM

గజ్వేల్ (విజయక్రాంతి): గజ్వేల్ పట్టణంలో సందర్భంగా ఏర్పాటు చేస్తున్న బాణాసంచా దుకాణం వ్యాపారులకు గజ్వేల్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ కుమార్ అగ్ని ప్రమాదాల నివారణ గురించి అవగాహన కల్పించారు. దుకాణాలకు అనుమతులు ఇవ్వడంలో భాగంగా సోమవారం దుకాణ సముదాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్రి ప్రమాదాలు జరగకుండా బాణాసంచా దుకాణాల వద్ద ముందస్తు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని సూచించారు.

బాణాసంచా వాహనాలు నిలపకుండా చూడాలని, డ్రమ్ములో నీటిని దుకాణాల వద్ద తప్పకుండా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి దుకాణాల వద్ద ఎక్స్టింగ్ విషెస్ ను కూడా తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దుకాణాల నిర్వహించే నాలుగు రోజులపాటు కూడా వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో దుకాణాల నిర్వహకులు ఫైర్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.