calender_icon.png 9 January, 2025 | 3:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరి నారుపై రైతులకు అవగాహన

30-12-2024 04:36:41 PM

మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని రైతులకు వరి నారు రసాయన ద్రావణంలో ఉంచి నాటు వేయడంపై మండల వ్యవసాయాధికారి కిరణ్మయి, వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతిలు ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించారు. మండలంలోని పొన్నారం గ్రామంలో జాడి పుణ్ణంకు చెందిన పొలంలో గ్రామ రైతులకు నారు మడి నుండి నారుని పొలంలో నాటు వేయు సమయంలో వరి నారు వేర్లను రసాయనిక ద్రావణంలో ముంచి నాటు వేయుటపై అవగాహన కల్పించారు.

ఈ విధానంలో క్లోర్ పైరిఫాస్ రసాయనిక ద్రావణాన్ని 2 మీ.లీ. ఒక లీటరు నీటికి కలిపి ఒక గుంత, లేదా డ్రమ్ములో తయారు చేసుకొని అట్టి ద్రావణంలో నారు మడి నుండి తీసిన నారు వేర్లను దాదాపు 12 గంటల పాటు ఉంచి నాటు వేసుకొన్నట్లైతే ప్రధాన పొలంలో ఒక నెల రోజుల వరకు ఎటువంటి రోగ కారక పురుగులు ఆశించకుండా పంటను కాపాడుకోవచ్చన్నారు. అదే విదంగా ఈ విధానాన్ని పాటించుట ద్వారా తక్కువ ఖర్చుతో పాటు పిచికారిల ద్వారా అయ్యే అదనపు పెట్టు బడిని తగ్గించుకోవచ్చని, ఈ విధానం పర్యావరణ హితమైనదని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు.