28-02-2025 06:35:29 PM
చెన్నూర్ (విజయక్రాంతి): భీమారం మండలం ఖాజిపల్లి గ్రామంలో రైతులకు డ్రోన్ ద్వారా తెగులు, పురుగుమందుల పిచికారి వల్ల కలిగే లాభాల గురించి వ్యవసాయ అధికారులు శుక్రవారం పలు సూచనలు చేశారు. చెన్నూరు వ్యవసాయ సహాయ సంచాలకులు బి ప్రసాద్ ఖాజీపల్లి గ్రామంలో క్షేత్ర సందర్శన చేసి మామిడిలో తేనె మంచు పురుగు, అంత్రకోనోస్ ను గమనించి నివారణకు టాలీఫెన్ ఫ్రైడ్ 2 ఎంఎల్ లీటర్ నీటిలో, కార్బెండిజం ప్లస్ మంకోజెబ్ 2 గ్రామ్స్ కలిపి పిచికారి చేసినట్లయితే తెగుళ్లను నివారించుకోవచ్చునన్నారు.
వరిలో కాండం తొలుచు పురుగు, ఆకు ముడత పురుగు ఉన్నట్లు గమనించిన వ్యవసాయ అధికారులు వీటి నివారణకు కార్టప్ హైడ్రోక్లోరైడ్ (75 శాతం ఎస్ జి) 200 గ్రాములు లేదా క్లోరన్తినీప్రోలు (18.5 శాతం ఎస్సీ) 60 ఎం.ఎల్ లేదా లాంబ్డాసైహలోత్రిన్ + క్లోరన్తినీప్రోలు 100 ఎంఎల్ ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసినట్లయితే నియంత్రించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అత్తే సుధాకర్, రైతులు పాల్గొన్నారు.