18-02-2025 04:33:40 PM
కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఇంపాక్ట్ ఫౌండేషన్ సర్టిఫైడ్ ట్రైనర్ వడ్లూరి రాజేష్ పరీక్షల సమయంలో "సమయ నిర్వాహణ, లక్ష్యాన్ని, సాధించడం జీవశాస్త్రంలో మెలకువలు ఎలా తీసుకోవాలో వివరించారు. ఈ కార్యక్రమంలో గుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జే. కవిత, ఉపాధ్యాయులు నరసింహ మూర్తి, ఇగూరపు మల్లేష్, వినయ్ కుమార్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.