24-03-2025 12:02:30 AM
కిమ్స్ ఆధ్వర్యంలో నిర్వాహణ
హైదరాబాద్, మార్చి 23 (విజయక్రాంతి): రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల కలిగే ప్రాణాపాయం ముప్పును రోజూ కొద్దిపాటి నడకతో జాగ్రత్తపడొచ్చని కిమ్స్ హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.భాస్కర్‌రావు అన్నారు. ఈ విషయంపై అవగాహన కల్పించేందుకు నెక్లెస్ రోడ్డు జలవిహార్ వద్ద ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (డీవీటీ)పై అవగాహన నడక నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డా. భాస్కర్‌రావు, కిమ్స్ ఆస్పత్రుల వాస్క్యులర్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ నరేంద్రనాథ్ మేడా, సర్జికల్ ఆంకాలజిస్ట్ డా. నాగేంద్ర పర్వతనేని, డా. ఫ్రాన్సిన్ శ్రీధర్, డా. జగదీష్ పాల్గొన్నారు. డా. భాస్కర్‌రావు మాట్లాడుతూ.. అమెరికాలో ఏటా 9 లక్షల మంది దీని బారిన పడుతుండగా, వారిలో లక్ష మంది వరకు ప్రాణాలు కూడా కోల్పోతున్నారని చెప్పారు. ముందుగా గుర్తించడం, సమర్థమైన చికిత్స, ప్రతిరోజూ నడకతో దీన్ని అధిగమించవచ్చు అన్నారు.
రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం అనేది కేవలం వైద్యపరమైన సమస్య మాత్రమేకాదు.. ఇప్పుడు ఇదో ప్రజారోగ్య సంక్షోభంగా మారిపోతోందన్నారు. ‘గడ్డలను ఆపేందుకు మీ వంతు ప్రయత్నం చేయండి: చర్యలకు పిలుపు’ అనేది 2025 సంవత్సరం రక్తపు గడ్డల అవగాహన మాసం థీమ్. రక్తపు గడ్డల నివారణకు ప్రతి ఒక్కరూ కీలకపాత్ర పోషించాలన్నది దీని అర్థం. కాథెటెర్ డైరెక్టెడ్ థ్రాంబోలిసిస్ లాంటి అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్నాయి.
ఇది వచ్చినప్పు డు ఊపిరి సరిగా అందకపోవడం, గుండె నొప్పి అనిపించడం కూడా ఉండొచ్చు. మూ డు గంటలకు పైగా కారు, రైలు, విమానాల్లో ప్రయాణం చేసినవారికీ ఈ సమస్య రావ చ్చు. “ఎక్యూట్ వీనస్ థ్రాంబో ఎంబోలిజం (వీటీఈ), డీప్ వీనస్ థ్రాంబోసిస్ (డీవీటీ), పల్మనరీ ఎంబోలిజం (పీఈ).. ఈ మూడిం టి వల్ల దీర్ఘకాల సమస్యలతో పాటు మరణం కూడా సంభవించే ప్రమా దం ఉం టుందని కిమ్స్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ వాస్క్యులర్, ఎండోవాస్క్యులర్ సర్జన్, డాక్టర్ నరేంద్రనాథ్ మేడా చెప్పారు.