29-03-2025 12:57:00 AM
కొత్తపల్లి, మార్చి 28: వాగేశ్వరి మహిళా డిగ్రీ, పి. జి కళాశాల వారి ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం శీతకాల శిబిరంలో భాగంగా మూడవ రోజు చిగురు మామిడి మండలం నవాబ్ పేట్ గ్రామంలో ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్స్ నినా దాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి, గృహ హింస చట్టాల మీద గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ రమేష్, ముదిరాజ్ సొసైటి అధ్యక్షుడు గుళ్ళ బాలయ్య, వెంకటేశం, రమేష్, సంపత్, కిష్టయ్య, ప్రనిధి ఫౌండేషన్ బోయిని వంశీ కృష్ణ, ముదిరాజ్ సంఘ సభ్యులు, వాగేశ్వరి మహిళా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ చెన్నోజు రమణ చారి, రమణ రెడ్డి, రవికిరణ్, చందు, రవికుమార్, ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్ నందగిరి స్వప్న , అధ్యాపకులు ఆర్. శ్రీలేక,జి. మౌనిక, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్స్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.