calender_icon.png 13 April, 2025 | 11:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంగారంలో సైబర్ నేరాలపై అవగాహన

03-04-2025 12:00:00 AM

యువకులకు సైబర్ నేరాల గురించి వివరించిన ఎస్‌ఐ రవి

మహబూబాబాద్. ఏప్రిల్ 2 : (విజయ క్రాంతి ): బుధవారం గంగారం ఎస్త్స్ర రవికుమార్  సైబర్ జాగరుకత దివస్ సందర్భంగా మడగూడెం గ్రామ యువతకు, గంగారం కేజీబీవీ విద్యార్థినులకు  సైబర్ మోసాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రవి మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్ ల ద్వారా ఎంతో మంది యువత లక్షల రూపాయలను పోగొట్టుకొని అప్పులపాలై బలవన్మర ణాలకు పాల్పడుతున్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ బెట్టింగ్ యాప్ ల జోలికి పోవద్దని సూచించారు.  గుర్తుతెలియని వ్యక్తులు ఏ విధంగా సంప్రదించినా ఎట్టి పరిస్థితిలో వారికి ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపవద్దన్నారు. ఎవరైనా సైబర్ మోసాలకు గురైనట్లయితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు కాల్ చేసి లేదా www.cybercrime.gov.in పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు.