calender_icon.png 31 March, 2025 | 5:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదక ద్రవ్యాలను నిర్మూలిద్దాం

28-03-2025 09:09:50 PM

సైబర్ క్రైమ్, షీటీం చట్టాలపై అవగాహన

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముగిసిన ఎన్ఎస్ఎస్ శిబిరం

 ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్

కామారెడ్డి,(విజయక్రాంతి): మారక ద్రవ్యాలను యువత నిర్మూలించేందుకు కృషి చేయాలని కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం ప్రభుత్వ అర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ మొదటి, రెండవ, మూడవ యూనిట్ల ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈనెల 22 నుండి ప్రారంభమైన ఎన్ఎస్ఎస్ వేసవికాల ప్రత్యేక శిబిరం  ముగిసిందని ప్రిన్సిపాల్  తెలిపారు.  ఈ సందర్భంగా ప్రిన్సిపల్, ఎన్ఎస్ఎస్ చైర్మన్ డాక్టర్ కె.విజయ్ కుమార్(NSS Chairman Dr. K.Vijay Kumar) మాట్లాడుతూ...  ఎన్ఎస్ఎస్ శిబిరం ప్రారంభమైన నాటి నుండి ముగిసేవరకు చేపట్టిన వివిధ అవగాహన కార్యక్రమాలను వివరించారు.  వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ స్కిల్స్, షీ టీం చట్టాలు పై అవగాహన, మాదకద్రవ్యాల నివారణ, సైబర్ క్రైమ్ ,ఎయిడ్స్ వంటి వ్యాధుల గూర్చి అనేక విషయాలు పై వాలంటీర్లకు అవగాహన కల్పించామన్నారు.ఈ సందర్భంగా వాలంటీర్లకు క్యాంపు సర్టిఫికెట్ లను అందచేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె కిష్టయ్య , అకాడమిక్  కోఆర్డినేటర్ విశ్వ ప్రసాద్,  ఐక్యుఏసి కోఆర్డినేటర్ అంకం జయప్రకాష్ , అర్థశాస్త్ర విభాగాధిపతి లెఫ్టినెంట్ డాక్టర్ ఏ సుధాకర్, బాటని విభాగాధిపతి దినకర్ చిన్న, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ పి రాజ గంభీర్ రావు , డాక్టర్ జి చంద్రశేఖర్ గౌడ్, డాక్టర్ బి శారద, వాలంటీర్లు పాల్గొన్నారు.