12-04-2025 08:18:42 PM
పటాన్ చెరు: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిన్నారం ఎస్సై నాగలక్ష్మి సూచించారు. మండల కేంద్రం జిన్నారంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో శనివారం సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సైబర్ నేరాలు జరుగుతున్న తీరును గ్రామస్తులకు వివరించారు. మొబైల్ కు వచ్చే లింకులను ఓపెన్ చేయొద్దని, తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్ లతో అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలియని యాప్ ల జోలికి వెళ్లి సైబర్ నెరగాల ఉచ్చులో పడొద్దన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.