25-02-2025 01:05:40 AM
మునగాల, ఫిబ్రవరి 24:- కోదాడ నియోజకవర్గం మునగాల ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ ఆదేశాల మేరకు కోదాడ షీ టీమ్స్ ఏయస్‌ఐ కృష్ణమూర్తి మునగాల మండల పరిధిలోని ఆకుపాముల మాంటిస్సోరి పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు సైబర్ నేరాలపైన, గంజాయి, డ్రగ్స్ మత్తుమందులపై, రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళాభృందంతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడంజరిగినది.
క్రిష్ణమూర్తి మాట్లాడుతూ జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ అధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలపై , సైబర్ నేరాలపై, గంజాయి డ్రగ్స్ మత్తు మందులు,గుట్కాపై పటిష్టంగాపనిచేస్తున్నామని తెలిపారు. సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా, ఏటియం కార్డ్ వివరాలు, ఓటిపి వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు.
మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు. సైబర్ మోసాలపై1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. వేధింపులకు గురి అయితే 100 కు సమాచారం ఇవ్వాలని తె లిపినారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లీమా రోస్, పాల్గొన్నారు.