19-02-2025 07:20:41 PM
చేగుంట (విజయక్రాంతి): ఇటీవల కాలంలో పెరిగిపోతున్న సైబర్ నేరాలపై విద్యార్థులకు, యువతకు జిల్లా ఎస్ పి ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు, చేగుంట ఎస్ ఐ శ్రీ చైతన్య కుమార్ రెడ్డి, ఆధ్వర్యంలో ఏఎస్ఐ రాంబాబు అవగాహన కల్పించారు. బుధవారం మండలంలోని వడియారం గ్రామంలో విద్యార్థులకు, యువతి, యువకులకు, సైబర్ నేరాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొద్ది నెలలుగా నమోదవుతున్న సైబర్ నేరాలను పరిశీలిస్తే బాధితుల్లో ఎక్కువగా డిజిటల్ అరెస్టు బాధితులు వుంటున్నారని దీనిని నివారించేందుకే విద్యార్థులను, యువతి, యువకులకు చైతన్యపరచాలని లక్ష్యంతో కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
ముఖ్యంగా ప్రస్తుత కాలంలో ఎక్కువగా ప్రజలు మోసపోయి చాలా డబ్బులు పోగొట్టుకున్న డిజిటల్ అరెస్టుకు సంబంధించిన సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుంది ప్రజలు ఎలా మోసపోతున్నారు అనే దాని గురించి వారికి వివరించారు. అసలు డిజిటల్ అరెస్టు పోలీసు వారు చేయరని, డిజిటల్ అరెస్టు కాల్స్ వస్తే www.cybercrime.gov.in సైబర్ ట్రోల్ ఫ్రీ నెంబర్ 1930 ఇంపార్టెంట్స్ పై గురించి తెలిపారు. ఆన్లైన్ మోసాలపై అడ్డుకట్ట వేయుటకు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో ఏఎస్సై రాంబాబు, కానిస్టేబుల్ విద్యార్థులు, యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు.