మందమర్రి (విజయక్రాంతి): ఇటీవల కాలంలో పెరిగిపోతున్న సైబర్ నేరాలపై విద్యార్థులకు సైబర్ క్రైమ్ డీఎస్పీ ఎం.వెంకటరమణ అవగాహన కల్పించారు. బుధవారం మండలంలోని సింగరేణి మహిళా డిగ్రీ జూనియర్ కళాశాల విద్యార్థులకు సైబర్ నేరాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొద్ది నెలలుగా నమోదవుతున్న సైబర్ నేరాలను పరిశీలిస్తే బాధితుల్లో ఎక్కువగా డిజిటల్ అరెస్టు బాధితులు వుంటున్నారని దీనిని నివారించేందుకే విద్యార్థులను చైతన్యపరచాలని లక్ష్యంతో జాగృత దివాస్ కార్యక్రమంలో కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యoగా ప్రస్తుత కాలంలో ఎక్కువగా ప్రజలు మోసపోయి చాలా డబ్బులు పోగొట్టుకున్న డిజిటల్ అరెస్టుకు సంబంధించిన సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుంది, ప్రజలు ఎలా మోసపోతున్నారు, అనే దాని గురించి వారికి వివరించారు. అసలు డిజిటల్ అరెస్టు పోలీసు వారు చేయరని, డిజిటల్ అరెస్టు కాల్స్ వస్తే www.cybercrime.gov.in, సైబర్ ట్రోల్ ఫ్రీ నెంబర్ 1930 ఇంపార్టెంట్స్ పై గురించి తెలిపారు. ఆన్లైన్ మోసాలపై అడ్డుకట్ట వేయుటకు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో కళాశాల కరెస్పాండెంట్ హీరాలాల్ ఉపాద్యాయ, పట్టణ ఏఎస్సై మజీద్ ఖాన్, విద్యార్థులు పాల్గొన్నారు.