12-02-2025 08:55:29 PM
ఉన్నత విద్యా మండలి చైర్మన్ వి బాలకృష్ణారెడ్డి...
మేడ్చల్ (విజయక్రాంతి): అవగాహన, అప్రమత్తతతోనే సైబర్ దాడుల బారిన పడకుండా ఉంటామని ఉన్నత విద్యా మండలి చైర్మన్, జేఎన్ టీయూహెచ్ ఇంచార్జి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం గుండ్ల పోచంపల్లి పరిధిలోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన సైబర్ స్పేస్ ను భద్రపరచడం-నేటి డిజిటల్ ప్రపంచానికి ఒక సవాలు అన్న అంశంపై ఒక రోజు సెమినార్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మనకు ఉన్న జ్ఞానాన్ని ఇతరులకు పంచాలని తద్వారా సైబర్ దాడులను ఎదుర్కోగలమన్నారు. ఇటీవల కాలంలో సైబర్ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు.
వింగ్ కమాండర్ గరికిపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ... సాధారణ ప్రజలు వాడే సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్ లు, స్మార్ట్ గడియారాలను సైబర్ నేరగాళ్లు తమ ఆధీనంలోకి తీసుకోవడం వల్ల ప్రజలకు నష్టం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ జే నరసింహారెడ్డి, కార్యదర్శి జె త్రిసూల్ రెడ్డి, కోశాధికారి త్రిలోక్ రెడ్డి, డైరెక్టర్ డాక్టర్ ఏ మోహన్, బంగారు లక్ష్మి, ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ లోకనాథం, ఎస్ ఏ సి కన్వీనర్ కే పురుషోత్తం ప్రసాద్, సమన్వయకర్తలు డాక్టర్ దిలీప్ రెడ్డి, శ్రీలక్ష్మి, శ్రీనివాస్, రేవతి, సౌమ్య, మెకానికల్ విభాగ అధిపతి అశోక్ కుమార్, ఎంబీఏ విభాగ అధిపతి నాగరాజు, సివిల్ విభాగ అధిపతి వెంకటేష్, వరప్రసాద్, గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.