నిర్మల్ (విజయక్రాంతి): ప్రజలు ఆహారపు అలవాట్లు పాన్ గుట్కా మసాలా సిగరెట్లు మత్తు పానీయాల వల్లనే క్యాన్సర్ రావడానికి గల కారణమని ప్రముఖ వైద్యులు డాక్టర్ కృష్ణంరాజు అన్నారు. బుధవారం నిర్మల్ పట్టణంలోని బస్టాండ్ లో క్యాన్సర్ డే పురస్కరించుకొని ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ అవగాహన సదస్సులు ఏర్పాటు చేయగా క్యాన్సర్ రావడానికి గల కారణాలను వివరించి నివారణ పద్ధతులను ప్రజలకు అవగాహన కల్పించారు. వ్యాధి సోకిన వారికి ప్రభుత్వం ద్వారా ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ నిర్వాహకులు చంద్రమోహన్ రెడ్డి నేరెళ్ల హనుమంతు గంగారెడ్డి రవికిరణ్ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.