calender_icon.png 23 October, 2024 | 6:45 PM

మెదడు, వెన్నెముక వ్యాధుల పట్ల అవగాహన అవసరం..

23-10-2024 04:21:38 PM

నాసా హాస్పిటల్స్ ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రియాజ్..

ముషీరాబాద్ (విజయక్రాంతి): మెదడు, వెన్నెముక సంబంధిత వ్యాధుల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని నాసా హాస్పిటల్స్ ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా.రియాజ్ పేర్కొన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, అత్యాధునిక సదుపాయాలతో కాంప్రహెన్సివ్ బ్రెయిన్ స్ట్రోక్ సెంటర్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నాసా హాస్పిటల్ బ్రోచర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆధునిక జీవన విధానాలు, తీవ్రమైన మానసిక ఒత్తిడుల కారణంగా ఎక్కువ మంది ప్రజలు మెదడు, వెన్నెముక సంబంధిత సమస్యలు, మరీ ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్(పక్షవాతం)కు గురవుతున్నారన్నారు.

మెదడు, వెన్నెముక సంబంధిత సమస్యలకు ప్రత్యేకంగా చికిత్సలందించేందుకు ఈ అత్యధునాతన బ్రెయిన్ స్ట్రోక్ సెంటరును ఆవిష్కరించామని తెలిపారు. ఎల్.బి.నగర్ చింతల్ కుంటలోని నాసా హాస్పిటల్స్ నందు ఈ సెంటర్ ను ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే బ్రెయిన్ స్ట్రోక్ నుంచి ప్రజలను రక్షించేందుకు 'బీ ఫాస్ట్' ప్రోగ్రాంను రూపొందించినట్లు తెలిపారు. ప్రఖ్యాత స్పైన్ సర్జన్ జిపివి సుబ్బయ్య, ప్రముఖ న్యూరాలజిస్ట్ డా.వెనిగళ్ల నవీన్ కుమార్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డా.వి.శ్రీధర్ నారాయణ, డా.వెణుతురుమిల్లి రాకేష్, డా.ఎం.కార్తీక్, డా.కె.పృథ్వీరాజ్ తదితర నిష్ణాతులైన వైద్య నిపుణులు ఈ సెంటర్ నందు సేవలందిస్తారని వెల్లడించారు. సెంటర్ ప్రారంభోత్సవ సందర్భంగా బ్రెయిన్ స్ట్రోక్ ప్రివెంటివ్ ప్యాకేజీలు, సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్లపై 50 శాతం రాయితీ అందిస్తున్నామని ప్రకటించారు. చికిత్సలందించడంతో పాటు, వ్యాధి నియంత్రణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.