calender_icon.png 5 December, 2024 | 8:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బయోడైవర్సిటీపై నేటితరానికి అవగాహన పెంచాలి

05-12-2024 01:01:37 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

శేరిలింగంపల్లి, డిసెంబర్ 4 (విజయక్రాంతి): బయో డైవర్సిటీపై నేటితరానికి అవగాహన పెంచాల్సి ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా బుధవారం ఆయన నగరంలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి బొటానికల్ గార్డెన్‌లో తెలంగాణ అటవీ శాఖ నిర్వహించిన వేడుకకు హాజరయ్యారు. అనంతరం ఫారెస్ట్ అండ్ ఏకో టూరిజం డెవలప్‌మెంట్ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు.

ఎలక్ట్రికల్ వాహనంలో పార్క్‌లోని మద్దివనం, సౌందర్యవనం, అక్షర వనం, వంటింటి వనం, పచ్చి ఎరువుల వనం, అల్ఫా బీట్ వనం, భోజపత్ర వనం థీం పార్కులను సందర్శించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ..  గత ప్రభుత్వం అడవులు, పర్యావరణ శాఖలను నిర్లక్ష్యం చేసిందన్నారు. మంత్రి సురేఖ మాట్లాడుతూ.. ఆర్‌ఆర్‌ఆర్ వెంట యూకలిప్టస్, సీతాఫలం, రోజ్‌వుడ్, శాండిల్‌వుడ్, ప్లాంటేషన్ చేపడతామన్నారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి శాసనసభ్యుడు అరికెపూడి గాంధీ, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ముఖ్యమంత్రి స్పెషల్ సెక్రటరీ చంద్రశేఖర్‌రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.