calender_icon.png 2 February, 2025 | 7:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జంతు సంరక్షణపై అవగాహన..

29-01-2025 08:02:18 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): పశు వైద్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జంతు సంరక్షణ పక్షోత్సవాలలో భాగంగా సారపాక నందు గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు జంతు సంరక్షణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జంతువుల పట్ల దయా కరుణ కలిగి ఉండాలని పెంపుడు జంతువులకు సరైన సమయంలో టీకాలు వైద్యము అందించాలని వీధి పశువులు వీధి కుక్కల పట్ల ప్రేమతో మెలగాలని జంతువులను వేటిని కూడా హింసించరాదని అన్నారు. ఈ ప్రపంచం జంతువులకు కూడా నివాసమే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఉపన్యాస పోటీలు నిర్వహించి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించడం జరిగింది.

అనంతరం ప్రజలను మేల్కొల్పుటకై జంతు సంరక్షణపై అవగాహన గురించి ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు దూద, జిల్లా పశు వైద్య, పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు, సహాయ సంచాలకులు డాక్టర్ సత్యప్రసాద్, సారపాక ప్రాథమిక పశు వైద్య కేంద్రం పశువైద్యులు డాక్టర్ బాలకృష్ణ, మొరంపల్లి బంజర పశు వైద్యులు డాక్టర్ రాజేందర్, ఎస్ పి సి ఎ సభ్యులు ఉదయ్ కుమార్, పశు సంవర్ధక శాఖ సిబ్బంది పాల్గొన్నారు.