20-02-2025 01:01:57 AM
* లబ్ధిదారుల ఫైనల్ జాబితా సిద్ధం చేసుకోవాలి
* తాగునీటి సమస్యలు రానివ్వద్దు
* సంబంధించిన అధికారులతో వెబ్‌ఎక్స్ ద్వారా సమావేశం
* జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, ఫిబ్రవరి 19 ( విజయక్రాంతి ) : ఇందిరమ్మ ఇండ్లకు ఎంపికైన లబ్ధిదారులు వేగంగా ఇళ్ల నిర్మాణం ప్రారంభం చేసే విధంగా ఆయా గ్రామాల్లో లబ్ధిదారులకు అవగాహన సమావేశాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో అతనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్ తో కలిసి తహసిల్దార్ లు, ఎంపీడీవోలు, ఎంపీ వోలు, పంచాయతీ సెక్రటరీలతో వెబ్‌ఎక్స్ ద్వారా సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో ప్రభుత్వ పథకాలకు ముందుగా ఎంపిక చేయబడిన 15 గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ఎంపికై మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణం ప్రారంభం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలను ఆదేశించారు. లబ్ధిదారులందరికీ ఆయా గ్రామాల్లో గ్రామ పంచాయతీ సమావేశాలు నిర్వహించి, ఇళ్ల నిర్మాణం పై అవగాహన కల్పించాలన్నారు.
లబ్ధిదారులందరినీ సమావేశానికి పిలిపించి కొత్తగా ఇల్లు నిర్మాణం చేసుకునే వారికే పథకం వర్తిస్తుందని, ఇదివరకే సగం నిర్మించిన వారికి వర్తించదని తెలియజేయాల న్నారు. అదేవిధంగా, జిల్లాలోని మిగతా గ్రామాల్లో కూడా పథకాలు ఏ క్షణమైనా ప్రారంభమయ్యే అవకాశం ఉందని, కాబట్టి అరుల జాబితాను మరోసారి వెరిఫై చేసి లబ్ధిదారుల ఫైనల్ జాబితా సిద్ధం చేసుకోవాలని ఎంపీడీవోలకు సూచించారు. ఒకే ఇం ట్లో ఇద్దరికీ పథకాల లబ్ధి చేకూరాకుండా జాగ్రత్తగా వెరిఫై చేయాలని చెప్పారు. ఎట్టి పరిస్థితిలోనూ అనరులు జాబితాలోకి చూ సుకోవాలన్నారు.
తాగునీటి సమస్యలు రానివ్వదు
వేసవి సమీపిస్తున్న తరుణంలో గ్రామా లు, పట్టణాల్లో ఎట్టి పరిస్థితుల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మిషన్ భగీరథ నీటి పైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో స్థానికంగా ఉండే బోర్లను వినియోగించేలా ఏర్పాటు చేయాలన్నారు. ఆయా గ్రామాల్లో స్థానిక తాగునీటి వనరులు బోర్లు, మోటార్లు, చేతి పంపులు ఏవైనా పనిచేయకుండా ఉన్నట్లయితే వెంట నే వాటిని మరమ్మతులు చేయించి సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజెస్ ఏవైనా ఉంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు. గ్రామాల్లో ఉండే ట్యాంకుల్లో నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, పది రోజులకు ఒకసారి క్లోరినేషన్ చేయించాలని ఆదేశించారు. వా టర్ ట్యాంకర్లను కూడా అవసరాన్ని బట్టి సిద్ధం చేసుకోవాలన్నారు. స్థానికంగా ప్రత్యామ్నాయ నీటి వనరులు లేని గ్రామాల్లో ప్రైవేటు బోర్లను అందుబాటులోకి తీసుకొని వాటి ద్వారా తాగునీటిని అందించేలా చర్య లు తీసుకోవాలన్నారు.
ఉపాధి హామీకి వచ్చే కూలీలకు పని ప్రదేశాల్లో ఎండ నుంచి ఉపశమనం కల్పించేందుకు నీడ తాగునీరు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జెడ్పి సీఈవో యాదయ్య, డి ఆర్ డి ఓ ఉమాదేవి, డిపిఓ సురేష్, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు నాయక్, హౌసింగ్ అధికారులు విఠోబా, పర్వతాలు, మిషన్ భగీరథ కార్యనిర్వాహక ఇంజనీరు మెగా రెడ్డి, వెబ్ ఎక్స్ ద్వారా తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీ ఓలు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.