21-03-2025 06:58:13 PM
మందమర్రి,(విజయక్రాంతి): మండలంలోని రైతులు తమ పంట పొలాల్లో పంట మార్పిడి విధానాలు పాటించి అది గదికి పడి సాధించాలని చెన్నూరు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు భానోత్ ప్రసాద్(Chennur Agriculture Department Assistant Director Bhanot Prasad) కోరారు. మండలంలోని మామిడిగట్టు గ్రామంలో శుక్రవారం పంట మార్పిడి విధానంపై గ్రామ రైతులకు అవగాహన కలిగించారు. పంట మార్పిడి ప్రయోజనాలు, పంట మార్పిడి, పప్పు ధాన్యాల సాగు విధానాలపై రైతులకు అవగాహన కలిపించారు. ఆయిల్ పామ్ తో పంట మార్పిడి చేసినప్పుడు కలిగే ప్రయోజనాలను వివరించి ప్రభుత్వ సబ్సిడీ, మద్దతు ధర తదితరాలపై వివరించారు. ఆనంతరం వ్యవసాయ యాంత్రీకరణ పథకం, పంటల నమోదు, వరి తో పాటు వివిధ పంటలపై వచ్చు చీడపీడలు, వాటి నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి కిరణ్మయి, ఉద్యాన అధికారి కల్యాణి, వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతి, అజయ్, మాజీ సర్పంచ్ కోట రాయలింగు, మాజి ఉప సర్పంచ్ సత్తయ్య, రైతులు గజ్జె రాజేష్, దుర్గం లింగయ్య, శంకరయ్య, లక్ష్మణ్, పోశం లు పాల్గొన్నారు.