దండేపల్లి (విజయక్రాంతి): మండలంలోని గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని దండేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని చింతపల్లి, రెబ్బనపల్లిలో జాతీయ ఆరోగ్య మిషన్, ఆరోగ్య వైద్య సేవలు అందించడంలో భాగంగా కళాజాత బృందంచే బుధవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ మాట్లాడుతూ..... జాతీయ ఆరోగ్య మిషిన్ ద్వారా అందిస్తున్న వైద్య సేవలు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలు అసంక్రమణ వ్యాధులు బిపి, షుగర్, క్యాన్సర్ లాంటి వ్యాధులు సంక్రమణ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా, దోమలు పెరగడం వాటిని నిర్మూలించడానికి పుట్టకుండా చూసుకోవడానికి చేపట్టిన చర్యల గురించి అవగాహన జాతీయ క్షయ వ్యాధి నివారణ భాగంగా ముందస్తుగా పరీక్షలు చేయడము కేసులను గుర్తించి మందులను అందజేయడం జరుగుతుందని అన్నారు.
పోషకాహారం కోసం రోగులకు సౌకర్యాలు కల్పించడం కుష్టు వ్యాధి కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు హెచ్ఐవి ఎయిడ్స్ పై ప్రజలు జాగ్రత్త పడడం, వైరస్ల వ్యాప్తి నుంచి నివారణ కొరకు జాగ్రత్తలు తీసుకోవడానికి మాస్కులు ధరించడం మొదలైన వాటిపైన, 100% గర్భవతుల నమోదు నిర్వహించలని అన్నారు. సిజేరియన్లు వద్దు సాధారణ ప్రసవాలే ముద్దు, 100% శాతం టీకాలు ఇప్పించడం వాటిపైన ప్రజలకు అవగాహన కల్పించి ప్రజందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సతీష్, డాక్టర్ వంశీకృష్ణ, కమ్యూనిటీ ఆరోగ్య అధికారి రాజారెడ్డి, జిల్లా మాస్ మీడియా అధికారి భూక్య వెంకటేశ్వర్, పర్యవేక్షకులు రాము, పోసాని వసంత కుమార్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ప్రజల పాల్గొన్నారు.