19-02-2025 08:32:43 PM
మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలో సింగరేణి సంస్థలో డిజిటలైజేషన్ ప్రక్రియలో భాగంగా పైలెట్ ప్రాజెక్టుగా నూతన ఉద్యోగుల నియామక ప్రక్రియపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మణుగూరు ఏరియా జిఎం కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సింగరేణిలో కొత్తగా నియమాకం కాబోయే ఉద్యోగుల వివరాలను డిజిటలైజేషన్ ద్వారా నమోదు చేయడానికి Pre–Hiring ప్రక్రియను పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టినట్లు ఏరియా డీజీఎం పర్సనల్ ఎస్ రమేష్ ఈ సందర్భంగా తెలిపారు.
కార్పొరేట్ డిజిఎం(SAP) ఎస్ వెంకటేశ్వర్లు, మణుగూరు ఏరియా సంక్షేమ అధికారులు, సంబందిత సిబ్బందికి డిజిటలైజేషన్ ప్రక్రియ ద్వారా కారుణ్య నియామకం, బదిలీ వర్కర్ నియామకానికి ముందు వివరాలను నమోదు చేయడానికి సింగరేణి వ్యాప్తంగా డిజిటలైజేషన్ SAP HR లో కొత్త నిబంధన సృష్టించబడిందని పేర్కొన్నారు. డిజిటలైజేషన్ ప్రక్రియ ద్వారా డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ ప్రాసెస్ మైన్/డిపార్ట్‌మెంట్ స్థాయిలో ఉద్యోగానికి అభ్యర్థిని ప్రతిపాదించినప్పటి నుంచి యూనిట్ లెవెల్ అధికారులు మొదలుకొని ఏరియా స్థాయిలో అధికారులు ఎంక్వైరీ పరిశీలిన అనంతరం ఏరియా హాస్పిటల్ నందు మెడికల్ ఫిట్ అయి మరల వారి వివరాలు OSL (overall seniority list) కార్పొరేట్ లో అప్లోడ్ చేస్తారని తెలిపారు. కార్పొరేట్ ఉత్తర్వులు అనుసరించి ఆయా ఏరియాలలో పోస్టింగ్ ఉత్తర్వులను ఏరియా నందు జనరేట్ చేయబడి ఉద్యోగికి సంబంధిత గని/ డిపార్ట్మెంట్ పోస్టింగ్ ఉత్తర్వులు ఇస్తారన్నారు.
చివరగా యూనిట్ లెవెల్ లో ఉద్యోగి రిపోర్టింగ్ అనంతరం ఉద్యోగుల పూర్తి వివరాలతో కూడిన బయో డేటా నమోదు చేయబడుతుందన్నారు. సింగరేణి వ్యాప్తంగా ఈ కార్యక్రమం అమలు కొరకై మొదటగా మణుగూరు ఏరియాలో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డివై.పిఎం కార్పొరేట్( SAP) సత్యనారాయణ గారు, డివై.పిఎం, కార్పొరేట్ (SAP) శ్రవణ్ , డివై.పిఎం పి.బి.అవినాష్, సీనియర్ పిఓలు వి రామేశ్వర రావు, ఓంకార్ బాపు, డి.నరేశ్ గారు, మేనేజ్మెంట్ ట్రైనీ( పర్సనల్) సాయి శ్వేత, ఎస్ చంద్రకిరణ్, అరుణ్ తేజ, వంశీ కృష్ణ, అన్నీ విభాగాల మినిస్ట్రియల్ స్టాఫ్, తదితరులు పాల్గొన్నారు.