21-04-2025 12:00:00 AM
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
పాల్గొననున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ చామల, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 20: భూభారతి చట్టం పై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఒక ప్రకటన ద్వారా తెలిపారు. నేడు ఇబ్రహీంపట్నం శాస్తా గార్డెన్స్ లో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రెవిన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, ప్రభుత్వ అధికారులు పాల్గొన్ని, భూభారతి చట్టం పై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవ ర్గంలోని మాజీ ప్రజా ప్రతినిధులు, రైతులు, నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నావలసిందిగా పేర్కొన్నారు.