calender_icon.png 28 April, 2025 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ నెల 29న భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు

27-04-2025 06:38:44 PM

తాహసీల్దార్ ఎండి ముజీబ్..

మద్నూర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈ నెల 29న మంగళవారం భూభారతి కొత్త రెవెన్యూ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు తహశీల్దార్ ఎండి ముజీబ్(Tahsildar MD Mujeeb) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం రైతు వేదికలో భూభారతి చట్టం అవగాహన సదస్సు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి  జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు అదే విధంగా బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఉన్నతాధికారులు హాజరుకానున్నారని రైతులు సదస్సుకు హాజరుకావాలని ఆయన కోరారు.