calender_icon.png 21 April, 2025 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామీణ రైతుల భూ సమస్యల పరిష్కారానికి భూభారతి ఒక వరం

21-04-2025 05:25:24 PM

అనంతగిరి: భూభారతి చట్టం వల్ల రైతులకు ఎంతో ప్రయోజనాలు ఉన్నాయని కలెక్టర్ నందలాల్ పవర్ అన్నారు. మండల పరిధిలోని శాంతినగర్ గ్రామ పరిధిలోని ఎస్ డబ్ల్యుసి గోడౌన్ లో సోమవారం భూభారతిపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ధరణిలో ఎలాంటి సవరణలకు అవకాశం లేదని భూభారతిలో ఆ వెసులుబాటు ఉందన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే భూములు రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలుందన్నారు. భూములకు సంబంధించిన వివరాలన్నీ ఆన్ లైన్లో నమోదు చేస్తారని వీటిని అన్ని శాఖాలకు పంపించడం జరుగుతుందన్నారు. సవరించే అధికారం ఆన్ లైన్లో సంబంధిత అధికారులకే ఉంటుందన్నారు  ఆధార్ లాగే భూములకు భూ ఆధార్ కార్డు ఇస్తామన్నారు. ధరణిలో లేని అప్పీల్ అవకాశం భూభారతిలో ఉందని వెల్లడించారు.