కరీంనగర్ సిటీ, ఆగస్టు 13: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ అటానమస్ కళాశాలలో మంగళవారం లూసియానా టెక్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ అఫైర్స్ డైరెక్టర్ జేఆర్ లిగాన్‌చే విద్యార్థులకు గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. జెఆర్ లిగాన్, కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్‌రావు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ జువ్వాడి సుమిత్‌సాయిలు జ్యోతిప్రజ్వలన చేశారు. జువ్వాడి సాగర్‌రావు మాట్లాడుతూ.. కళాశాలలో విద్యార్థు లను ప్రపంచస్థాయి సవాళ్లకు సిద్ధం చేయడంలో ఇలాంటి సహకారం కీలకమని చెప్పా రు. అనంతరం జెఆర్ లిగాన్ లుసియానా టెక్ యూనివర్సిటీలో విద్యాబోధన, పరిశోధన అవకాశాలు, విశ్వవిద్యాలయ విశేషాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కెఎస్ రావు, డీన్ డాక్టర్ పికే వైశాలి పాల్గొన్నారు.