మునగాల: మండల ప్రత్యేక అధికారి డిప్యూటీ సీఈఓ శిరీష అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల సర్వేపై ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులకు మునగాల మండల కేంద్రము రైతు వేదికలో అవగాహన సదస్సు నిర్వహించి ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ.. అన్ని గ్రామాలలో అధికారులు విచారణ ప్రారంభించినందున గ్రామ స్థాయిలో గల కమిటీ సభ్యులు సర్వేకు సహకరించాలని కోరినారు. గ్రామాలలో నిరుపేద కుటుంబాలకు అనాధలకు ట్రాన్స్ జెండర్ లకు గతంలో అగ్నిప్రమాదం వల్ల గాని ఏ ఇతర కారణాల వల్ల గాని నివాస గృహాలు కూలిపోయిన వారిని గుర్తించాలన్నారు.
అదేవిధంగా వచ్చిన ప్రతి దరఖాస్తును విచారణ జరపాలని కోరారు. ఎక్కడ కూడా తప్పులకు తావు లేకుండా సర్వే చేయాలని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులు సంఖ్య 7 అనుగుణంగా విచారణలు చేయాలని తెలిపారు. అందరూ కూడా ఇట్టి సర్వేను ఈ మాసము 25వ తేదీ వరకు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో రమేష్, దీన్ దయాల్, యంపీఓ దారా శ్రీనివాస్, అగ్రికల్చర్ ఆఫీసర్ రాజు, గ్రామాల ప్రత్యేక అధికారులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొలిశెట్టి బుచ్చి పాపయ్య, కాసర్ల కోటయ్య, కొంపల్లి వీరబాబు, మట్టయ్య, శంకర్, వెంకటేశ్వర్లు, జె.శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు, గ్రామాల ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.