calender_icon.png 29 April, 2025 | 9:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధిలో దగాపడ్డ దళితుల చైతన్య యాత్ర ప్రారంభం

23-04-2025 07:36:35 PM

యాత్రను ప్రారంభించిన సింగరేణి రిటైర్డ్ జిఎం ఆనందరావు..

హక్కులు అమలయ్యే వరకు వెనుతిరిగేది లేదన్న బొమ్మెర శ్రీనివాస్..

టేకులపల్లి (విజయక్రాంతి): షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి జేఏసీ ఐక్య సంఘాల వేదిక ఆధ్వర్యంలో టేకులపల్లి మండలం బేతంపూడి గ్రామంలో ఏజెన్సీ ప్రాంతలో దగాపడ్డ దళితుల మేల్కో చైతన్య యాత్ర సింగరేణి రిటైర్డ్ జిఎం ఆనందరావు బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమానికి షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతంలో తొలగించిన ఎస్సీ, బిసి స్థానిక జెడ్పిటిసి, ఎంపీటీసీ, రిజర్వేషన్ స్థానిక ఉద్యోగ నియామకాలు  వెంటనే అమలు చేయాలి. కట్టుకున్న ఇంటిపైన సాగు భూమి, పోడు భూమిపై ఆంక్షలు లేకుండా అక్కుపత్రాలు ఇచ్చి అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఏజెన్సీ ప్రాంతం పేరుతో షెడ్యూల్డ్ కులాలను హక్కులకు దూరం చేయొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలు దగా పడ్డ దళితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చైతన్య యాత్ర గ్రామాలు, మండలాలు, జిల్లాలు చుట్టుకొని హైదరాబాద్ నగరాన్ని తాకుతుందని దీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు అంకినీడు ప్రసాదు, షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ కాకెళ్లి సైమన్, మంద వెంకటేశ్వర్లు, రాష్ట్ర కోఆర్డినేటర్ ఎనగంటి కృపాకర్, ఐక్య సంఘాల వేదిక జిల్లా నాయకులు మెంతిని ప్రభాకర్ అరుణోదయ కళామండలి జిల్లా కళాకారుడు, మెంతిని కొండలరావు, నరాల రాజేష్, జిల్లా నాయకులు మీసాల రాములు, సరికొండ స్వామి,  కత్తుల వెంకన్న, ఎనగంటి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.