23-04-2025 11:23:14 PM
లక్షెట్టిపేట (విజయక్రాంతి): పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు పట్టణంలోని మహాలక్ష్మి వాడలో పోలీస్ కళాజాత బృందంచే ప్రజలకు మూఢ నమ్మకాలు, సైబర్ క్రైమ్, ఈవ్ టీజింగ్, గంజాయి, రాష్ డ్రైవింగ్, ఆత్మహత్యలపై అవగాహన బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళజాత బృందం నాటక రూపంలో జానపదాలతో ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై సురేష్ మాట్లాడుతూ... ప్రజల్లో చైతన్యం తేవాలని ప్రజలు అపోహలను నమ్మకూడదన్నారు. పోలీస్ శాఖ అనుక్షణం ప్రజల కోసం పని చేస్తుందన్న విషయం గుర్తు పెట్టుకోవాలని ఎలాంటి సమస్య ఉన్న పోలీస్ లను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, కాలనీ ప్రజలు, కళాజాతర బృందం సభ్యులు పాల్గొన్నారు.