15-03-2025 11:05:20 PM
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్...
అశ్వరావుపేట (విజయక్రాంతి): దమ్మపేట మండలం పూసుకుంట గ్రామంలో గిరిజనులకు ఎలక్ట్రికల్ కుక్కర్ వినియోగంపై కలెక్టర్ శనివారం అవగాహన కల్పించారు. గిరిజనులకు ఎలక్ట్రికల్ కుక్కర్ ఉపయోగించడంపై అవగాహన కల్పించడంలో భాగంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ స్వయంగా కుక్కర్ పై వంట చేసి ఏ విధంగా సులువుగా వంట చేసుకోవచ్చు గిరిజనులకు చూపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గిరిజన మహిళలతో ముచ్చటించారు. ఎలక్ట్రికల్ కుక్కర్ ఉపయోగించి వంటను సులభంగా తయారు చేయవచ్చని, మారుతున్న కాలానికి అనుగుణంగా అందుబాటులో ఉన్న అన్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని గిరిజనులు అభివృద్ధి చెందాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో పూసుకుంట గిరిజన మహిళలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.