19-03-2025 05:01:01 PM
మెదక్ స్పెషల్ బ్రాంచ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సందీప్ రెడ్డి..
చేగుంట (విజయక్రాంతి): చందాయిపేట్ ప్రభుత్వ పాఠశాలలో MENTORING BY EMINENT EXPERT TALK భాగంగా నేడు పాఠశాలలో సందీప్ రెడ్డి (సర్కిల్ ఇన్స్పెక్టర్) స్పెషల్ బ్రాంచ్ మెదక్ చే విద్యార్థులపై చెడు వ్యసనాల ప్రభావం గురించి వివరించడం జరిగింది. అనంతరం విద్యార్థులకు, చేతిరాత నిపుణులు ఇజాద్ అహ్మద్, విద్యార్థులకు చేతిరాతపై మెలుకలు గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ సంతోష, సీనియర్ ఉపాధ్యాయులు అజిత, విటల్ రెడ్డి, నర్సింలు, వీణ, సలీం, రాములు, గిరిధర్, స్వప్న, సిద్ధి రాములు, శ్రీనివాస్, బంగారయ్య, సౌజన్య దామోదర్, యాదగిరి, శంకర్, రాజు, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.