22-02-2025 01:27:31 AM
పిట్లం, ఫిబ్రవరి 21 ః ముందు జాగ్రత్తతో టీబి వ్యాధిని జయించవచ్చని డిపిపిఎం శోభారాణి తెలిపారు.కామారెడ్డి జిల్లా పిట్లం జాతీయ రహదారి ఫ్లై ఓవర్ బ్రిడ్జి ఆవరణలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో టీబీ వ్యాధిపై వాల్ పెయింటింగ్ వేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు.
డిపిపిఎం శోభారాణి మాట్లాడుతూ, జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా టీబీ లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి, నిర్ధారణ అయిన వారికి 6 నెలల పాటు ఉచిత మందులు అందజేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిబి సూపర్వైజర్ రేఖతో పాటు ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొని, టీబీ వ్యాధి లక్షణాలు, నివారణా చర్యలు, వైద్య సదుపాయాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ విధమైన కార్యక్రమాలు ప్రజలు ఆరోగ్య సబంధిత విషయాలలో మరింత అవగాహన పొందడానికి దోహదపడతాయని వారు పేర్కొన్నారు.