calender_icon.png 9 March, 2025 | 6:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీబీ వ్యాధిపై అవగాహన

07-03-2025 01:01:59 AM

కల్లూరు, మార్చి 6 (విజయ క్రాంతి ): ఖమ్మం జిల్లా క్షయ నిర్మూలన అధికారి డాక్టర్ సుబ్బారావు ఆదేశాల మేరకు కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నవ్యకాంత్ సహకారంతో  మండల పరిధిలోని పేరువంచ గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి,  ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా టీబీ నోడల్ అధికారి జి.రామారావు మాట్లాడుతూ టీబీ అంటు వ్యాధి అని,గాలి   ద్వారా ఒకరు నుండి మరొకరికి వ్యాపిస్తుందన్నారు.

క్షయ వ్యాధి పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండి,  లక్షణాలు ఉన్నవాళ్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీబీ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో టీబీ చికిత్స సూపర్వైజర్ వై.సురేష్, ల్యాబ్ సూపర్‌వైజర్ సంజీవ్ కుమార్, ఏఎన్‌ఎం పద్మ, ఆశ కార్యకర్తలు కామేశ్వరి, వెంకటనర్సమ్మ,  ప్రభావతి, మీనా, సునీత పాల్గొన్నారు.