ఇల్లెందు (విజయక్రాంతి): జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు(SP Rohit Raju) ఆదేశానుసారం ఇల్లందు డిఎస్పి చంద్రభాను(DSP Chandrabhanu) సారధ్యంలో ఇల్లందు పట్టణ పోలీస్సులు ఎస్ఐ నాగులు మీరా సిబ్బందితో కలిసి గోవింద్ సెంటర్ వద్ద వాహనదారులకు ప్రజలకు రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించారు. ఇల్లందు టౌన్ ఎస్ హెచ్ ఓ మాట్లాడుతూ.. జనవరి ఒకటి నుండి జనవరి 31 వరకు జాతీయ రోడ్ భద్రత వారోత్సవాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు ఓవర్ స్పీడ్ పైన రాష్ డ్రైవింగ్ పైన అతివేగం ప్రమాదకరమని ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని అని చెప్పడం జరిగింది.
వాహనదారులు అతివేగంగా నడపడం వల్ల జరిగే ప్రమాదాల గురించి వివరించడం జరిగింది. మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు తప్పకుండా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. మద్యం త్రాగి వాహనాలు నడపరాదని, మానవ తప్పిదం వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. మితిమీరిన వేగం హెల్మెట్ లేకుండా ప్రయాణించడం రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడిపి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.