calender_icon.png 30 November, 2024 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుద్యోగులకు ‘ఐటీ’పై అవగాహన

30-11-2024 01:07:38 AM

‘నిపుణ’లో ప్రత్యక్ష ప్రసారాలు: టీ సాట్ సీఈవో

హైదరాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి): రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఐటీ ఉద్యోగాల సాధనపై టీ నెట్వర్క్ స్పెషల్ లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వ ఐటీ శాఖ ఆధ్వర్యం లో ఐటీ ఉద్యోగుల కోసం వీఎల్‌ఎస్ ఐ అవేర్నెస్ ప్రోగ్రాం పేరిట 5 నెలలపాటు ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయ ని టీణూ సీఈవో  బోదనంపల్లి వేణుగోపాల్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

పీవీసీ, టీఏఎస్‌కే, ఏఎస్‌ఐపీ, టీ సంయుక్తంగా డిజైన్ చేసిన కోర్సులను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా అందిస్తున్నామన్నారు. ప్రాధాన్యత కలిగిన సెమీ కండక్టర్ ఇండస్ట్రీ విభాగాలకు సం బంధించిన చిప్ డిజైనింగ్, ప్రొడక్షన్ కోర్సులపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్న ట్లు  సీఈవో వివరించారు.

రాష్ట్రంలోని ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, డిగ్రీ విద్యార్థులకు ఈ ప్రసారాలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. ఈ కార్యక్రమం నేడు ప్రారంభమై ఏప్రిల్ 26 వరకు కొనసాగుతుందన్నారు. ఈ ఐదు నెలల పాటు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వర కు  ప్రసారాలు ఉంటాయన్నారు.