calender_icon.png 27 April, 2025 | 6:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాహనదారులు హెల్మెట్ వాడకపోతే జరిమానా తప్పదు: మునుగోడు ఎస్ఐ ఇరుగు రవి

26-04-2025 09:56:05 PM

మునుగోడు,(విజయక్రాంతి): ద్విచక్ర వాహనాన్ని నడిపే ప్రతి వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని లేకపోతే వారికి జరిమానా తప్పదని మునుగోడు ఎస్ఐ ఇరుగు రవి(Munugode SI Irugu Ravi) హెచ్చరించారు. శనివారం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన కల్పించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు హెల్మెట్ వాడకపోవడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబం రోడ్డున పడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడకంతో పాటు ఇతరులకు కూడా హెల్మెట్ వాడాలని తెలుపాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది వీరాంజనేయులు నాగేశ్వరావు, రమణారెడ్డి, రాము, వెంకన్న, బాలాజీ, సతీష్, వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.