calender_icon.png 5 February, 2025 | 7:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాన్సర్ పట్ల అవగాహన పెంచుకోవాలి

05-02-2025 01:44:43 AM

జగిత్యాల అర్బన్, ఫిబ్రవరి 4: క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజలు అవగాహన పెంచుకొని, నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పి అశోక్’ కుమార్ పేర్కొన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా జగిత్యాల ఐఎంఏ, ప్రసూతి స్త్రీ జననేంద్రియ సంఘం ఆధ్వ ర్యంలో నిర్వహించిన రన్’ను కలెక్టర్, ఎస్పీ లు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోవా లని, క్యాన్సర్ సంబంధిత మరణాలలో భారతదేశం రెండో స్థానంలో ఉందన్నారు. 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల గల ఆడపిల్లలకు, రెండు మోతాదుల్లో టీకా ఇవ్వడం జరుగు తుం టదని, 26 సంవత్సరాల వరకు టీకాను తీసుకొని క్యాన్సర్ వ్యాధి నుండి రక్షణ పొందవచ్చన్నారు.

ఈ సందర్భంగా హెచ్పివి వ్యాక్సిన్ ద్వారా సర్వేకల్ క్యాన్సర్ అరికట్టవచ్చని ప్రజల అవగాహన కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైద్యులు తెలి పారు. చిన్న వయసులోనే టీకా తీసుకో వడం ద్వారా ఈ వైరస్ తద్వారా కలిగే క్యాన్స ర్ రాకుండా నిరోధించగ లమన్నారు. ఈ కార్యక్రమంలో  ఐఎంఏ అధ్యక్ష, కార్యదర్శు లు డాక్టర్ హేమంత్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్, గైనకాలజీ సంఘ అధ్యక్షులు డాక్ట ర్ జి.శ్రీలత, డాక్టర్ వి.రజిత, సీనియర్ వైద్య లు మోహన్’రెడ్డి, పద్మనీ విజయకుమార్,  శంకర్, సతీష్’కుమార్, శికాంత్’రెడ్డి, రామ కష్ణ పాల్గొన్నారు.