calender_icon.png 28 February, 2025 | 10:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత పంట రకాలను సాగు చేస్తున్న ఆదివాసి రైతులకు పురస్కారాలు

28-02-2025 06:23:05 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పాత పంట రకాలను సాగు చేస్తున్న ఆదివాసీ రైతులకు శుక్రవారం పురస్కారాలు అందించినట్లు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ కోట శివకృష్ణ తెలిపారు. పంట రకాలు, రైతు హక్కుల పరిరక్షణ అంశాలపై తెలంగాణలోని కృషి విజ్ఞాన కేంద్రాలకు సంబంధించిన రైతులకు అవగాహన కల్పించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలోని 16 కృషి విజ్ఞాన కేంద్రాల నుండి శాస్త్రవేత్తలు, పాత పంటలు సాగు చేస్తున్న ఆదివాసి రైతులు పాల్గొన్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిపివిఎఫ్ఆర్ఎ చైర్మన్ డాక్టర్ త్రిలోచనా మహా పత్ర, అటారి డైరెక్టర్ డాక్టర్ షేక్ మీరలతో పాటు వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొని పాత పంట రకాలు, రైతుల హక్కులు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు, పంటల సంరక్షణ, నమోదు చేసుకునే విధానాలపై కృషి విజ్ఞాన కేంద్రాలు చేయవలసిన విధివిధానాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా పాత రకాలు సాగు చేస్తున్న కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలానికి చెందిన ఉత్తమ రైతులు ఆత్రం భీంరావ్, నైతం రఘులను ఘనంగా సన్మానించి ఉత్తమ రైతు పురస్కారాలు అందజేసినట్లు బెల్లంపల్లి కె.వి.కె ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ శివకృష్ణ చెప్పారు.