ఈశ్వరగారి ముక్తేశ్వరి పౌండేషన్, వేములవాడ వారి ‘సాహితీ అవార్డులు-2023’ ఫలితాలను సంస్థ చైర్మన్ ఈశ్వరగారి నరహరి శర్మ వెల్లడించారు. ఈ మేరకు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. కథలసంపుటి విభాగంలో రూ.10,116/- పురస్కారానికి కె.వి.ముని సురేష్ పిళ్లై రచించిన ‘గారడివాడు’, రూ.5,116/- ప్రత్యేక పురస్కారానికి, అమరనాది నీరజ రచించిన ‘ఏడు రంగుల జెండా’ ఎంపికైనాయి. వ్యాస సంపుటి విభాగంలో ఆడెపు లక్ష్మిపతి రచించిన ‘దిక్చక్రం’ రూ.10,116/- పురస్కారానికి ఎంపికైంది. రూ.5,116/- ప్రత్యేక పురస్కారానికి వి.రాజారామ మోహన్‌రావు రచించిన ‘నవలా హృదయం-3’ ఎంపికైంది. ఆధ్యాత్మిక రచనా సంపుటి విభాగంలో రూ.10,116/- పురస్కారానికి డా. నిట్టల గోపాలకృష్ణ రచన ‘గోమాత అద్భుత శక్తి’ ఎంపికైంది.
రూ.5,116/- ప్రత్యేక పురస్కారానికి యోగాచార్య ఎస్. సంపత్ కుమార్ రచన ‘యోగ- సర్వవ్యాధి నిరోధక్’ గ్రంథం ఎంపికైంది. ఈ పురస్కారాలకు న్యాయ నిర్ణేతలుగా డా.మంగారి రాజేందర్ (జింబో), కూర చిదంబరం, డా. బి.ఎస్. రాములు, గిరిజా మనోహర్ బాబు, డాక్టర్ నమిలకొండ సునీత, గరిపిల్లి అశాకి వ్యవహరించారు. విజేతలతోపాటు సాహితీ అవార్డుల కోసం నిర్ణీత విభాగాల్లో తమ రచనలు పంపిన వారందరినీ ఈనెల చివరి వారం వేములవాడలో జరిగే అవార్డుల ప్రదానోత్సవంలో సముచితంగా సత్కరిస్తారని చైర్మన్ తెలిపారు.