calender_icon.png 29 April, 2025 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత్రికేయులను వరించిన అవార్డులు

28-04-2025 05:24:37 PM

మహాత్మ జ్యోతిరావు పూలే జాతీయ ఐకాన్ అవార్డు-2025 అందుకున్న పిల్లి రవికిరణ్, మహమ్మద్ ఖాసీం, జాడ క్రాంతి కుమార్ లు..

మందమర్రి (విజయక్రాంతి): జిల్లాలోని మందమర్రి మండలానికి చెందిన పాత్రికేయులు రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకొని రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపుపొందారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో అభిలాష హెల్పింగ్ హ్యాండ్ ఆర్గనైజేషన్(Abhilasha Helping Hands Organization) ఆధ్వర్యంలో జరిగిన మహాత్మ జ్యోతిరావు పూలే జాతీయ ఐకాన్ అవార్డు కార్యక్రమంలో ఉత్తమ జర్నలిస్టుల విభాగంలో జిల్లాలోని రామకృష్ణాపూర్‌ పట్టణానికి చెందిన పిల్లి రవికిరణ్, మందమర్రి పట్టణానికి చెందిన మహమ్మద్ ఖాసీం, జాడ క్రాంతి కుమార్ లు మహాత్మ జ్యోతిరావు పూలే జాతీయ ఐకాన్ అవార్డు-2025ను అందుకున్నారు.

ప్రజల సమస్యలను, సామాజిక అంశాలను స్పష్టంగా ప్రజల ముందుకు తీసుకురావడంలో చూపిన నిబద్ధతకు గుర్తింపుగా వీరికి అవార్డులు లభించాయని అవార్డులు అందుకున్న పాత్రికేయులు తెలిపారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలు మాట్లాడుతూ... "ఈ గౌరవంతో మరింత బాధ్యతను పెంచింది. ప్రజల వాస్తవ పరిస్థితులను వెలికి తీసేందుకు, న్యాయంగా సమాచారం అందించేందుకు కృషి చేస్తాం" అని వారు స్పష్టం చేశారు. అదేవిధంగా సామాజిక సేవా రంగంలో పట్టణానికి చెందిన కొండ సతీష్ ను సైతం మహాత్మ జ్యోతిరావు పూలే జాతీయ ఐకాన్ అవార్డు - 2025 పురస్కారంతో సత్కరించారు. ఈ సందర్బంగా పలువురు పట్టణ ప్రజలు, పలువురు జర్నలిస్టులు, ప్రముఖులు అభినందించారు.