03-03-2025 05:24:15 PM
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం పట్టణంలోని అహోబిలం మటం నందు ఈ నెల 9వ తారీఖు ఆదివారం సాంస్కృతిక సేవరంగాలలో విశేష ప్రతిభ కనబరిచిన చిన్నారులకు భద్రాద్రి సేవ తత్ఫరులకు లిట్టిల్ చాంప్స్ అకాడమీ ఒంగోలు వారిచే అవార్డ్స్ అందించనున్నట్లు అకాడమీ అద్యక్షుడు శ్రీ భుచ్చేశ్వర రావు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన హరిత మిత్ర లయన్ డాక్టర్ గోళ్ళ భూపతి రావు, అహోబిలం మట్టం ఆధ్యాత్మిక గురువు బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ కృష్ణ చైతన్య స్వామికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియచేశారు.
ఈ కార్యక్రమము చిన్నారుల కూచిపూడి నృత్యాలు, తెలుగు ఉపాధ్యాయురాలు శ్రీమతి ఆకివీటి సరోజ, ప్రవచనం ఏర్పాటు చేసినట్లు తెలియచేశారు. అదే విధంగా నాట్యం అభినయించిన ప్రతి ఒక్కరికి మెమెంటో ప్రశంసాపత్రం, ప్రముఖులకు జాతీయ సేవ పురస్కారాలు అందిస్తున్నామని తెలియచేశారు. కావున భద్రాద్రి వాసులు ఆదివారం సాయంత్రం నాలుగు 4 గంటలకు ప్రారంభం అయ్యే ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా నిర్వాహకులు కోరారు.