26-03-2025 01:14:21 AM
అభినందించిన డిప్యూటీ రీజినల్ మేనేజర్లు శంకర్, మాధవి
ఎల్బీనగర్, మార్చి 25 : ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి కృషి చేస్తున్న ఉత్తమ ఉద్యోగులను రీజినల్ మేనేజర్లు సన్మానించి, పురస్కారాలు, ప్రసంశపత్రాలు అందజేశారు. డివిజన్ డిప్యూటీ రీజినల్ మేనేజర్లు శంకర్, మాధవి మంగళవారం హయత్ నగర్ ఆర్టీసీ డిపోలను సందర్శించారు. ఫిబ్రవరి నెలలో ఉత్తమ ఉద్యోగుల అభినందన కార్యక్రమాల్లో వేర్వేరుగా పాల్గొన్నారు. ఫిబ్రవరి నెలలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్ సిబ్బందికి నగదు పురస్కారాలు, ప్రసంశపత్రాలు అందజేసి, అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టీసీ సంస్థ ఉద్యోగుల అభివృద్ధికి, వారి శ్రేయస్సుకు ఎంతగానో కృషి చేస్తుందన్నారు. ఉద్యోగులు అంకితభావం తో పని చేస్తున్నారని, అదే ఒరవడి కొనసాగించి ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమoలో డిపో మేనేజర్ విజయ్, సహాయ మేనేజర్లు విజయకుమారి, సత్తయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.