- విక్రమ్‌సింగ్, మాణిక్‌రాజ్‌లకు విశిష్ఠ సేవా పురస్కారాలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
హైదరాబాద్, జనవరి 25 (విజయక్రాంతి): గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీసులకు కేంద్ర హోంశాఖ ఉత్తమ సేవా పతకాలను శనివారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 942 మందిని ఎంపిక చేశారు. 95 మందికి గ్యాలంటరీ, ఇద్దరికి ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలెంటరీ, 101 మందికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా మెడల్స్, 746 మందికి ఉత్తమ పోలీసు సేవా పతకాలు ప్రకటించింది.
తెలంగాణకు ఏపీఎస్ అధికారులు విక్రమ్‌మాన్‌సింగ్, మెట్టు మాణిక్‌రాజ్ రాష్ట్రపతి విశిష్ఠ సేవా పురస్కారాలకు ఎంపికయ్యారు. 14 మందికి ఉత్తమ సేవా పతకాలు దక్కాయి. సీబీఐ జేడీగా ఉన్న డీ శ్రీనివాస్ వర్మ, ఐజీ కార్తికేయ, ఎస్పీ ఏ ముత్యంరెడ్డి, డీసీలు రాంకుమార్, మహ్మద్ ఫజ్లుర్ రెహ్మాన్, డీఎస్పీలు కే వెంకటరమణ, ఏ వేణుగోపాల్, ఏఎస్‌ఐలు రణ్‌వీర్‌సింగ్ ఠాకూర్, పీటర్ జోసెఫ్ బహదూర్, ఇన్‌స్పెక్టర్ నిరంజన్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ పత్యానాయక్, ఆయూబ్‌ఖాన్, ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ డీ శ్రీనివాస్ రావు, ఏఎస్‌ఐ రవించంద్రన్ రాష్ట్రపతి మెడల్స్ అందుకున్నారు. ఆర్పీఎఫ్ పోలీసులకు మెడల్స్ రావడంపై ద.మ.రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ హర్షం వ్యక్తం చేశారు.