calender_icon.png 4 April, 2025 | 6:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నార్సింగి మున్సిపాలిటీకి అవార్డులు

04-04-2025 12:11:05 AM

రాజేంద్రనగర్, ఏప్రిల్ 3 (విజయ క్రాంతి): నార్సింగి మున్సిపాలిటీకి రెండు అవార్డులు వచ్చాయి. ఈ మేరకు మున్సిపాలిటీ కమిషనర్ కృష్ణమోహన్ గురువారం అందుకున్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం లో జరిగిన రాష్ట్రస్థాయి సమావేశంలో నార్సింగి పురపాలక సంఘం 85 శాతం కు పైగా ఇంటి పన్ను వసూళ్లు సాధించినందుకు, అదేవిధంగా గత మూడు సంవత్సరాలుగా ఉత్తమ ఫలితాలు సాధించిన నేపథ్యంలో సిడిఎంఏ ఐఏఎస్ టికే శ్రీదేవి మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డికి ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. అవార్డులు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమ సిబ్బంది అందరి కృషితో ఉత్తమ ఫలితాలు సాధించినట్లు ఆయన తెలియజేశారు. మరింత ఉత్సాహంతో కష్టపడి పనిచేస్తామన్నారు.