* బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, కాసం
హైదరాబాద్, జనవరి 28 (విజయక్రాంతి): జాతీయ స్థాయిలో ఇచ్చే అవార్డు లపై కూడా రాజకీయం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారు మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డికి రాజకీయ అనుభ వం తక్కువని, అందుకే విధివిధానాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదన్నారు. సెర్చ్ కమిటీలోని విధివిధానాల ప్రకారం జాతీ య అవార్డులను ప్రకటిస్తారనే విషయం తెలుసుకోవాలన్నారు. పీవీకి, అంబేద్కర్‌కు కాంగ్రెస్ పార్టీ భారతరత్న ఎందుకివ్వలేదని ప్రశ్నించారు.